News June 14, 2024
ఆ సినిమాల జోలికి వెళ్లను: RGV
పొలిటికల్ సినిమాలు తీయనని ఇప్పటికే ప్రకటించిన రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఆ మాటను నొక్కి చెప్పారు. కొత్త దర్శకులను పరిచయం చేసే ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పొలిటికల్ బయోపిక్స్ జోలికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. కాగా వ్యూహం, శపథం వంటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను ఆయన తీశారు. ఇవి చంద్రబాబు, లోకేశ్, పవన్‌ను ఉద్దేశించే తీశారంటూ ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
Similar News
News September 11, 2024
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా తల్లి కాబోతున్నారు. ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా హంట్, పులి, నేను శైలజ, సిల్లీ ఫెలోస్, రంగులరాట్నం, అహో విక్రమార్క చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ను చిత్రా వివాహం చేసుకున్నారు.
News September 11, 2024
Stock Market: మార్కెట్లను డ్రైవ్ చేస్తున్న US CPI డేటా
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 25,059, బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్లు ఎగిసి 81,999 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్. నేడు యూఎస్ సీపీఐ డేటా రావాల్సి ఉండటం, అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బిగ్ డిబేట్ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News September 11, 2024
సీఎం రేవంత్‌కు రూ.కోటి విరాళం అందజేసిన పవన్
TG: వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా ప్రకటించిన రూ.కోటి విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ మేరకు రేవంత్‌తో సమావేశమై చెక్కు ఇచ్చారు. ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.