News June 15, 2024

AP విద్యాశాఖ మంత్రి ఎవరంటే?

image

AP మంత్రుల పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేకంగా విద్యాశాఖ అని పేర్కొనకపోవడంతో ఈ శాఖ ఎవరికీ కేటాయించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మానవ వనరుల అభివృద్ధి (Human Resource Development) అని మెన్షన్ చేసింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్య, అక్షరాస్యత పెంపు లాంటి అంశాలు ఉంటాయి. ఈ శాఖను సీఎం చంద్రబాబు.. లోకేశ్‌కు కేటాయించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలూ ఆయనకే దక్కాయి.

Similar News

News April 17, 2026

రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు

image

TG: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వాటిలో 15,600 మంది పేషంట్లు సేవలు పొందుతున్నారు. మరోవైపు 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News April 17, 2026

5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

image

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్‌తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.