News June 15, 2024
AP విద్యాశాఖ మంత్రి ఎవరంటే?
AP మంత్రుల పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేకంగా విద్యాశాఖ అని పేర్కొనకపోవడంతో ఈ శాఖ ఎవరికీ కేటాయించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మానవ వనరుల అభివృద్ధి (Human Resource Development) అని మెన్షన్ చేసింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్య, అక్షరాస్యత పెంపు లాంటి అంశాలు ఉంటాయి. ఈ శాఖను సీఎం చంద్రబాబు.. లోకేశ్‌కు కేటాయించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలూ ఆయనకే దక్కాయి.
Similar News
News September 20, 2024
త్వరలోనే EHS రూపొందిస్తాం: మంత్రి దామోదర
TG: ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన EHSను త్వరలో రూపొందిస్తామని మంత్రి రాజనర్సింహ అన్నారు. 2014లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతామని ఊదరగొట్టి BRS మొండిచేయి చూపించిందని దుయ్యబట్టారు. ఇప్పుడు BRS పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అన్నారు. 10ఏళ్లుగా నిద్రలో జోగిన BRS నాయకులకు ఇప్పుడు EHS గుర్తుకు రావడం విడ్డూరమన్నారు.
News September 20, 2024
స్థానికత విషయంలో నీట్ విద్యార్థులకు ఊరట
TG: స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్థానికత వ్యవహారంపై HC తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారి ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టుకు వివరించింది. స్థానికతను నిర్ధారిస్తూ తీర్పులున్నా ఆ విద్యార్థులు HCని ఆశ్రయించారంది.
News September 20, 2024
నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్
లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.