News June 15, 2024
TDP గెలిచిందనే అక్కసుతో వాటర్ ట్యాంకులో పురుగు మందు?
AP: అనంతపురం జిల్లా కనేకల్ మం. తుంబిగనూరులో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీటి శుద్ధజల ట్యాంకులో నిన్న రాత్రి పురుగు మందు కలిపి విషప్రయోగానికి కుట్ర చేశారు. ఉదయాన్నే ట్యాంకులో డబ్బా గుర్తించి, ఎవరూ ఆ నీళ్లు తాగకపోవడంతో ముప్పు తప్పింది. టీడీపీ గెలిచిందన్న అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆ గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆయన మరణం దేశానికి తీరని లోటు. కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధానిగా దేశానికి సేవలందించారు’ అని చంద్రబాబు కొనియాడారు. ‘మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, మానవతావాది. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని రేవంత్ పేర్కొన్నారు.
News December 27, 2024
దేశం గొప్ప నేతను కోల్పోయింది: ప్రధాని మోదీ
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు.
News December 27, 2024
మాటలు తక్కువ.. పని ఎక్కువ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.