News June 15, 2024

TDP గెలిచిందనే అక్కసుతో వాటర్ ట్యాంకులో పురుగు మందు?

image

AP: అనంతపురం జిల్లా కనేకల్ మం. తుంబిగనూరులో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీటి శుద్ధజల ట్యాంకులో నిన్న రాత్రి పురుగు మందు కలిపి విషప్రయోగానికి కుట్ర చేశారు. ఉదయాన్నే ట్యాంకులో డబ్బా గుర్తించి, ఎవరూ ఆ నీళ్లు తాగకపోవడంతో ముప్పు తప్పింది. టీడీపీ గెలిచిందన్న అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆ గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Similar News

News September 9, 2024

స్వయం సహాయక మహిళలకు ఏటా 2 చీరలు: సీఎం రేవంత్

image

TG: IITHకు వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలోనే భవనం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. IITH ఏర్పాటు చేయాలని కోరగానే రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మంజూరు చేశారని తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కరణల కోసం దీనిని ప్రారంభించినట్లు చెప్పారు. మరోవైపు 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఏటా 2 చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

News September 9, 2024

గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం!

image

ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఉపనది ప్రాణహితకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. అలాగే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నీరంతా ఒకటి, రెండు రోజుల్లో గోదావరికి చేరనుంది. అటు ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి నదులకు సైతం ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News September 9, 2024

విజయ్ కొడుకు డైరెక్షన్‌లో సందీప్ కిషన్?

image

తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్‌తో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసన్‌కు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమా కావడం గమనార్హం. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.