News June 15, 2024
అమరావతి బాధ్యతను నాపై ఉంచారు.. అహర్నిశలు శ్రమిస్తా: నారాయణ

AP: అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయని.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి డెవలప్‌మెంట్ బాధ్యతను తనపై ఉంచారని, చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేలా అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధి, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తామన్నారు.
Similar News
News November 14, 2025
ఉసిరిలో తుప్పు తెగులు – నివారణ ఎలా?

ఉసిరిలో తుప్పు తెగులు సోకిన చెట్ల ఆకులపై తొలుత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇవి తుప్పు రంగుకు మారతాయి. వాటిని మనం చేతితో ముట్టుకుంటే ఆ రంగు మన చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వదశకు చేరే కంటే ముందే రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 1ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి చెట్టుపై పిచికారీ చేయాలి.
News November 14, 2025
డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్‌రెడ్డి

TG: దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.
News November 14, 2025
ఫలించని రాహుల్ యాత్ర.. అన్నింటా వెనుకంజ!

‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ఇటీవల బిహార్‌లోని 25 జిల్లాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఇందులో 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఓట్ చోరీ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క చోటా కాంగ్రెస్ ఆధిక్యంలోకి రాలేదు. ఇటీవల రాహుల్ ప్రచారం చేసిన సీట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ లీడ్‌లో ఉండటం గమనార్హం.


