News June 15, 2024
అమరావతి బాధ్యతను నాపై ఉంచారు.. అహర్నిశలు శ్రమిస్తా: నారాయణ
AP: అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయని.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి డెవలప్‌మెంట్ బాధ్యతను తనపై ఉంచారని, చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేలా అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధి, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తామన్నారు.
Similar News
News September 9, 2024
Stock Market: నష్టాల నుంచి లాభాల్లోకి
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఆరంభ నష్టాలను అధిగమించి లాభాలు గడించాయి. సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 81,559 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 24,936 వద్ద నిలిచాయి. ఉదయం నుంచి కూడా 24,950 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఎదుర్కొన్న నిఫ్టీ సూచీ అక్కడక్కడే కన్సాలిడేట్ అయ్యింది. ఆమెరికా జాబ్ డేటా భయపెట్టినా కూడా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడం గమనార్హం.
News September 9, 2024
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మాదే: హేజిల్‌వుడ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటామని ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తాజాగా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు BGT కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 2014లో హేజిల్‌వుడ్ టెస్టుల్లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి నేటి వరకు భారత్‌తో ఆడిన ఒక్క టెస్టు సిరీస్ కూడా ఆస్ట్రేలియా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో గెలుపుకోసం తాము ఆకలిగా ఉన్నామని జోష్ పేర్కొన్నారు.
News September 9, 2024
ట్రిలియనీర్లుగా మారనున్న మస్క్, అదానీ!
ప్రపంచ కుబేరుడిగా పేరు తెచ్చుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2027నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా మారుతారని ఓ నివేదికలో వెల్లడైంది. ట్రిలియన్ డాలర్ అంటే సుమారు రూ. 83 లక్షల కోట్లు. మస్క్ సంపద సగటున 110 శాతం చొప్పున పెరుగుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద వార్షికంగా 123% వృద్ధి చెందితే ఆయన 2028నాటికి ట్రిలియనీర్‌గా మారుతారని అంచనా. కాగా మార్క్ జుకర్‌బర్గ్‌కు మరో రెండేళ్లు పట్టొచ్చు.