News June 15, 2024

చట్టబద్ధ కమిషన్‌నే కేసీఆర్ తప్పుబడతారా?: బండి సంజయ్

image

TG: విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను KCR తప్పుబడతారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయతీ, ధైర్యసాహసాలను ప్రశంసించారు. మీ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది’ అని మండిపడ్డారు.

Similar News

News January 15, 2025

సంక్రాంతి మూవీస్: ఏ సినిమా బాగుంది?

image

ఈ సారి సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మీరు ఏ సినిమా చూశారు? ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి?

News January 15, 2025

ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు BIG షాక్

image

నామినేషన్లకు ముందు ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్! లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు EDకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులను విచారించే ముందు ED అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు నవంబర్లో సూచించిన సంగతి తెలిసిందే. కాగా తనపై తప్పుడు ఛార్జిషీటు దాఖలు చేశారని కేజ్రీ ఆరోపిస్తున్నారు.

News January 15, 2025

24 గంటల్లో Rs1.87 లక్షలు పెరిగిన BITCOIN

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో అదరగొట్టాయి. మార్కెట్ విలువ 2.93% ఎగిసి $3.37Tకి చేరుకుంది. 57% మార్కెట్ డామినెన్స్ ఉన్న బిట్‌కాయిన్ $94,836 నుంచి 2.43% పెరిగి $97,043 వద్ద ట్రేడవుతోంది. అంటే $2207 (Rs1.87L) లాభపడింది. ఎథీరియం సైతం 2.81% ఎగిసి $3226 వద్ద చలిస్తోంది. XRP ఏకంగా 9.69% పెరిగి $2.79కు చేరుకుంది. BNB 1.54, SOL 2.75, DOGE 5.51, ADA 7.63, AVAX 4.18, XLM 7.81% మేర పెరిగాయి.