News June 15, 2024
చట్టబద్ధ కమిషన్‌నే కేసీఆర్ తప్పుబడతారా?: బండి సంజయ్
TG: విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను KCR తప్పుబడతారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయతీ, ధైర్యసాహసాలను ప్రశంసించారు. మీ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది’ అని మండిపడ్డారు.
Similar News
News September 7, 2024
వాయు, శబ్ద కాలుష్యంతో సంతానలేమి సమస్యలు
అధిక కాలం వాయు కాలుష్యానికి ప్రభావితం కావడం వల్ల పురుషుల్లో, ట్రాఫిక్ శబ్దాల వల్ల మహిళల్లో సంతానలేమి సమస్యలు పొంచి ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. PM2.5కు గురికావడం అనేది వయస్సుతో సంబంధం లేకుండా పురుషుల్లో వంధ్యత్వ సంభావ్యతతో ముడిపడి ఉందని డెన్మార్క్ పరిశోధకులు వెల్లడించారు. ట్రాఫిక్ శబ్దాలు 35 ఏళ్లు పైబడిన మహిళల్లో, 37 ఏళ్లు పైబడిన పురుషుల్లో సమస్యలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
News September 7, 2024
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. రెండో పాట రిలీజ్ డేట్ ఈ Septలో అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వినాయక చవితి కానుకగా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కాగా ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు.
News September 7, 2024
BREAKING: మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం.. ఆరుగురి మృతి
మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో మైతేయి, కుకీ తెగల మధ్య మరోసారి వివాదం మొదలైంది. జిల్లాలోని నుంగ్‌సిప్పి, రషీద్‌పూర్ గ్రామాలలోని తేయాకు తోటల్లో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.