News June 16, 2024
మెదక్ ఘటనపై పోలీసులకు బండి సంజయ్ ఫోన్
TG: మెదక్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. నిందితులపై కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అమాయకులపై కేసులు పెట్టొద్దంటూ బండి హెచ్చరించినట్లు సమాచారం. మెదక్‌లో గోవధకు ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే.
Similar News
News January 6, 2025
పుష్పకేమో నీతులు.. గేమ్ ఛేంజర్‌కు పాటించరా!: అంబటి
AP: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ మరణించిన అభిమానులకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరిహారం ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘పుష్పకేమో నీతులు చెప్తారా.. ‘గేమ్ ఛేంజర్’కి పాటించరా!’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
News January 6, 2025
HMPV ఎఫెక్ట్: హాస్పిటల్స్ షేర్లకు లాభాలు
దేశంలో <<15078134>>కొత్త వైరస్<<>> కేసులతో మదుపర్లు భయాందోళనలకు గురవడంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రుల షేర్లు మాత్రం లాభాల్లో పరిగెడుతున్నాయి. అపోలో, రెయిన్‌బో, KIMS, ఆస్టర్, నారాయణ హృదయాలయ తదితర హాస్పిటళ్ల షేర్లు 2-4% లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తి చెంది ఆస్పత్రులకు తాకిడి పెరుగుతుందనే ఊహాగానాలే దీనికి కారణాలుగా మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
News January 6, 2025
మోహన్ బాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇవాళ వాదనలు కొనసాగాల్సి ఉండగా ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులోకి రాలేదు. దీంతో మరో న్యాయవాది పాస్ ఓవర్ కోరగా ధర్మాసనం అంగీకరించలేదు. గురువారానికి వాయిదా వేసింది. కాసేపటికి ముకుల్ రోహత్గీ వచ్చి విజ్ఞప్తి చేసినప్పటికీ న్యాయమూర్తులు అంగీకరించలేదు.