News January 6, 2025

HMPV ఎఫెక్ట్: హాస్పిటల్స్ షేర్లకు లాభాలు

image

దేశంలో <<15078134>>కొత్త వైరస్<<>> కేసులతో మదుపర్లు భయాందోళనలకు గురవడంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రుల షేర్లు మాత్రం లాభాల్లో పరిగెడుతున్నాయి. అపోలో, రెయిన్‌బో, KIMS, ఆస్టర్, నారాయణ హృదయాలయ తదితర హాస్పిటళ్ల షేర్లు 2-4% లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తి చెంది ఆస్పత్రులకు తాకిడి పెరుగుతుందనే ఊహాగానాలే దీనికి కారణాలుగా మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Similar News

News January 16, 2025

నేడు ఈడీ విచారణకు కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 7నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరడంతో నేడు రావాలని నోటిసులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

News January 16, 2025

ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్

image

ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.

News January 16, 2025

తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి

image

AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.