News June 17, 2024

రబీ కరవు అంచనాకు ఏపీకి కేంద్ర బృందాలు

image

AP: రాష్ట్రంలో రబీ సీజన్‌లో ఏర్పడిన కరవుపై అంచనా కోసం ఏపీకి కేంద్రం నుంచి 3 బృందాలు రానున్నాయి. రేపటి నుంచి శుక్రవారం వరకు ఒక బృందం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు, రెండో టీం కర్నూలు, నంద్యాల జిల్లాలు, మూడోది నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Similar News

News March 5, 2026

ఎక్కువ చదివినవారిలోనే నిరుద్యోగులు అధికం!

image

ఇండియాలో చదువు పెరిగే కొద్దీ నిరుద్యోగం కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ నిరుద్యోగ సగటు 3.2% ఉంటే డిగ్రీ చదివిన వారిలో ఇది 13%గా ఉంది. దీనిని ‘ఎడ్యుకేషన్ పారడాక్స్’ అంటారు. తక్కువ చదువుకున్న వారు ఏదో ఒక చిన్న పనిలో త్వరగా చేరుతుండగా.. పట్టభద్రులకు వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదు. డిగ్రీలున్నా నైపుణ్యాలు లేకపోవడం& ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

News March 5, 2026

ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

image

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్‌గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2026

30 రోజుల వరకే గ్యాస్ నిల్వలు.. ధరలు పెరిగే ఛాన్స్!

image

LNG ఉత్పత్తిని ఖతర్ నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిలో రాకపోకలు ఆగిపోవడం వల్ల ఇండియాపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా LPG స్టాక్ మాత్రమే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘LPG అవసరాలలో 80-85% దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ వాటా గల్ఫ్‌దే. మనకు ప్రత్యామ్నాయ సరఫరాదారులూ లేరు. ఈ నెల రావాల్సిన గ్యాస్ ఆలస్యమైతే ఇబ్బందులు తప్పవు. రేట్లు పెరిగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నాయి.