News June 17, 2024
రైల్వే మంత్రి తప్పుకోవాలని డిమాండ్!
<<13455686>>ప.బెంగాల్<<>>లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగించింది. ఇదిలా ఉంటే <<13455953>>వరుస<<>> ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పదవి నుంచి తప్పుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మోదీ చేసిన ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నితీశ్ కుమార్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు.
Similar News
News February 2, 2025
అలా జరగకపోతే పేరు మార్చుకుంటా: డైరెక్టర్
‘తండేల్’ డైరెక్టర్ చందూ మొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లవర్స్ రిపీటెడ్‌గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News February 2, 2025
కంగ్రాట్స్ టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
U-19 T20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత అమ్మాయిల్ని AP CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, YSRCP అధినేత YS జగన్ అభినందించారు. ‘మీ కష్టం, సంకల్పంతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి భారతీయుల్ని గర్వించేలా చేశారు’ అని చంద్రబాబు, ‘దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. తెలుగువారికి త్రిష గర్వకారణం’ అని లోకేశ్ కొనియాడారు. జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మాజీ CM జగన్ ఆకాంక్షించారు.
News February 2, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరే జట్లివే: పాంటింగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా వెళ్తాయని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపారు. ఆ రెండు జట్లు చెరో రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్నట్లు చెప్పారు. వీటికి పోటీగా హోంగ్రౌండ్స్ కావడంతో పాకిస్థాన్ రేసులో ఉంటుందన్నారు. ఈ జట్టు అంచనాలకు దొరకకుండా ప్రదర్శన చేస్తుందన్నారు. పాంటింగ్ వ్యాఖ్యలతో మాజీ కోచ్ రవిశాస్త్రి ఏకీభవించారు.