News June 18, 2024

మూడో స్థానానికి ఎగబాకిన మంధాన

image

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో సెంచరీ బాదిన ఆమె ఇంటర్నేషనల్ కెరీర్‌లో 7,000 పరుగుల మైలురాయి చేరుకున్నారు. ఈక్రమంలో 715 పాయింట్లతో వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్‌లోనూ పైకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో 772 పాయింట్లతో బ్రంట్(ఇంగ్లండ్), 768 పాయింట్లతో ఆటపట్టు(శ్రీలంక) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.

Similar News

News March 18, 2026

పితృత్వ సెలవులు ఇవ్వాలి: సుప్రీంకోర్టు

image

దేశంలోని ఉద్యోగులందరికీ పితృత్వ సెలవులు వర్తించే విధంగా చట్టం తేవాలని SC అభిప్రాయపడింది. దత్తతలో <<19406877>>మాతృత్వ<<>> సెలవులపై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తండ్రుల పాత్ర కీలకమని, నవజాత శిశువులకు నాన్న మాటలు, స్పర్శ ఎంతో అవసరమని పేర్కొంది. పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని, వారి బాధ్యతను సమానంగా పంచుకోవాలంది. కాగా ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఉద్యోగులకు ఇది అమల్లో ఉంది.

News March 18, 2026

బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

image

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.

News March 18, 2026

చక్రం తిప్పుతున్న త్రిష?

image

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ <<19317674>>త్రిష<<>> చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ TVK పార్టీ NDAతో పొత్తు నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే TN రాజకీయాల్లో సంచలనాలు తప్పేలా కనిపించడంలేదు. మరోవైపు AIADMK నేతలూ త్రిష‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. TVK,BJP,AIADMK కలిసి DMKను ఢీ కొట్టనున్నాయా?