News June 18, 2024
12వ PRC కమిషనర్ మన్మోహన్ రాజీనామా
AP: రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం(PRC) కమిషనర్ మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తనను రిలీవ్ చేయాలంటూ సీఎస్ నీరభ్ కుమార్‌కు లేఖను పంపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఈయనను ప్రభుత్వం 2023 జులైలో పీఆర్సీ కమిషనర్‌గా నియమించింది.
Similar News
News January 18, 2025
NTR వర్ధంతి.. సీఎం చంద్రబాబు నివాళులు
AP: నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని CM చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. స్త్రీలకు సాధికారతనిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో “అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం” అని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్’ అని పేర్కొన్నారు.
News January 18, 2025
చలికాలంలో అల్లం.. ఆరోగ్యానికి వరం
చలికాలంలో అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో టీ, సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
News January 18, 2025
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. స్టేటస్‌లకు మ్యూజిక్!
వాట్సాప్‌లో స్టేటస్‌లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ వచ్చింది. ఫొటోలకు 15 సెకన్లు, వీడియోలకు వాటి నిడివిని బట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఆడియో కోసం సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే.