News June 20, 2024
గంభీర్ రాక ఆటగాళ్లకు హెచ్చరికే: ఆకాశ్ చోప్రా

టీమ్ఇండియా కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేనని, సీనియర్ ప్లేయర్లకు అతడి రాక హెచ్చరికవంటిదని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. ‘కోచ్‌గా కన్ఫామ్ అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకూ గంభీర్ కొనసాగొచ్చు. రోహిత్, విరాట్, షమీ, జడ్డూ వంటి స్టార్ ఆటగాళ్ల వయసు అప్పటికి 40కి దగ్గర్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గౌతీ కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పదవీకాలం చాలా ఆసక్తిగా ఉండనుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
దానిమ్మ రైతులకు కాసుల పంట.. టన్ను రూ.2 లక్షలు

AP: దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. 3 నెలల క్రితం టన్ను రూ.50వేల నుంచి రూ.60 వేల వరకు పలికిన దానిమ్మ ఇప్పుడు ఏకంగా రూ.2 లక్షలు పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట తెగుళ్లు, బ్యాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తగా సాగు చేయడం వల్లే రేట్లు పెరిగాయని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 15వేలకు పైగా హెక్టార్లలో (ప్రధానంగా రాయలసీమ) దానిమ్మ పంట పండిస్తున్నారు.
News January 21, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.
News January 21, 2026
మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: పొన్నం

TG: మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘జాతరకు RTC బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రద్దీకి తగ్గట్లు 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నాం. 50 ఎకరాల్లో ఒకేసారి 1000 బస్సులు నిలిపేలా ఏర్పాటు చేశాం. బస్సులు మేడారం నుంచి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాం’ అని స్పష్టం చేశారు.


