News June 20, 2024

గంభీర్‌ రాక ఆటగాళ్లకు హెచ్చరికే: ఆకాశ్ చోప్రా

image

టీమ్ఇండియా కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేనని, సీనియర్ ప్లేయర్లకు అతడి రాక హెచ్చరికవంటిదని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. ‘కోచ్‌గా కన్ఫామ్ అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకూ గంభీర్ కొనసాగొచ్చు. రోహిత్, విరాట్, షమీ, జడ్డూ వంటి స్టార్ ఆటగాళ్ల వయసు అప్పటికి 40కి దగ్గర్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గౌతీ కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పదవీకాలం చాలా ఆసక్తిగా ఉండనుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News September 13, 2024

సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న తుదిశ్వాస విడిచిన సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి, రేపు ఉదయం హైదరాబాద్‌కు వస్తారు. కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించనున్న ఆయన, ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయల్దేరుతారు.

News September 13, 2024

ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం

image

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. వరద నష్టం, కొత్తవారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులు క్యాబినెట్‌‌లో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.

News September 13, 2024

మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట

image

AP: మంత్రి కొల్లు రవీంద్ర పాస్‌పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20న మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో పాస్‌పోర్ట్ పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఆయనపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాస్‌పోర్ట్ అధికారులు క్లియరెన్స్ నిరాకరించారు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో పాస్‌పోర్ట్ తిరస్కరించొద్దని సుప్రీం, హైకోర్టులు తీర్పులిచ్చాయని రవీంద్ర లాయర్ వాదించారు.