News June 20, 2024

అవసరమైతే NTAపైనా చర్యలు: కేంద్ర మంత్రి

image

NEET నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతైన విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నీట్ అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పారదర్శక పరీక్షల నిర్వహణే తమ లక్ష్యమని, విద్యార్థుల ప్రయోజనం విషయంలో రాజీపడబోమన్నారు. అందుకోసం బాధ్యులైన NTA అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News March 20, 2026

సీక్వెల్స్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటి?

image

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు తీయడం పెరుగుతోంది. ఈ జాబితాలో బాహుబలి, KGF, పుష్ప, కాంతార(ప్రీక్వెల్), డీజే టిల్లు, అఖండ, కార్తికేయ, ఇస్మార్ట్ శంకర్, దృశ్యం, F2, పొన్నియన్ సెల్వన్, హిట్, పొలిమేర, మత్తు వదలరా, మ్యాడ్, తాజాగా ధురంధర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సీక్వెల్ ఏంటో కామెంట్ చేయండి.

News March 20, 2026

ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.22 పెంపు

image

గల్ఫ్ యుద్ధ ప్రభావంతో దేశంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌పై రూ.22 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రూ.87.57 ఉన్న ధర రూ.109.59కి చేరింది. ఈ డీజిల్‌ను పరిశ్రమలు, రవాణా, పవర్ జనరేషన్‌‌లో ఉపయోగిస్తారు. ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్, రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

News March 20, 2026

స్టాక్ మార్కెట్లకు జోష్.. రూపాయి డౌన్

image

నిన్నటి భారీ నష్టాల నుంచి ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకొని లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 23,114 వద్ద సెటిల్ అయ్యాయి. క్రూడ్ టెన్షన్స్ తగ్గడం, కొనుగోళ్లు పెరగడం వంటివి మార్కెట్లలో జోష్ నింపాయి. రూపాయి మాత్రం ఒక డాలరుకు ₹93 మార్క్ దాటి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. FII విక్రయాలు, డాలర్ డామినేషన్, యుద్ధం ఇందుకు కారణాలు.