News June 20, 2024

అవసరమైతే NTAపైనా చర్యలు: కేంద్ర మంత్రి

image

NEET నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతైన విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నీట్ అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పారదర్శక పరీక్షల నిర్వహణే తమ లక్ష్యమని, విద్యార్థుల ప్రయోజనం విషయంలో రాజీపడబోమన్నారు. అందుకోసం బాధ్యులైన NTA అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News July 7, 2025

గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టిన గిల్

image

ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ గిల్‌కే ఇవ్వాలి. బ్యాటుతోనే కాకుండా.. కెప్టెన్‌గానూ అద్భుతం చేశారు. విదేశాల్లో అతిపిన్న వయసులో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్‌గా గవాస్కర్(26Y 198D) పేరిట ఉన్న రికార్డును గిల్(25Y 297D) బద్దలు కొట్టారు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, వారికి నచ్చిన ఫీల్డ్ సెట్ చేసి సూపర్ విక్టరీ సాధించారు. కచ్చితంగా డ్రా చేస్తామన్న ఇంగ్లండ్‌‌కు ఓటమి రుచి చూపించారు.

News July 7, 2025

జులై 7: చరిత్రలో ఈరోజు

image

1896: భారత్‌లో తొలిసారిగా బొంబాయిలో చలనచిత్ర ప్రదర్శన
1900: స్వాతంత్ర్య సమరయోధుడు కళా వెంకటరావు జననం
1915: సినీ నటుడు మిక్కిలినేని జననం
1929: పోప్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు
1930: ‘Sherlock Holmes’ రచయిత ఆర్థర్ కోనన్ మరణం
1959: రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జననం
1973: గాయకుడు కైలాశ్ ఖేర్ జననం
1981: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జననం
*ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

News July 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.