News June 21, 2024

BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

image

TG: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్‌లోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు. సూసైడ్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 16, 2026

నాడు ఫ్రీగా యాక్టింగ్.. నేడు ₹5.5 కోట్ల రాయల్టీ!

image

ఆస్కార్ అవార్డు పొందిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రం తనను మిలియనీర్‌ను చేసిందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘నిర్మాతలు తన ఫీజును భరించలేమని చెప్పడంతో ఫ్రీగా నటించా. అయితే సినిమా ఘనవిజయం సాధించాక వారు స్వచ్ఛందంగా పంపిన రాయల్టీ ద్వారా ₹5.5 కోట్లకు పైగా అందుకున్నా. ఇటీవలే రూ.3లక్షల చెక్ వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News March 16, 2026

షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

image

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో సన్‌ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్‌లైన్‌లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్‌ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.

News March 16, 2026

వయసుల వారీగా పిల్లలకు వేయించాల్సిన టీకాలు

image

* 24 గంటలు- BCG, హెపటైటిస్ B
* 6 వారాలు- OPV-1, RVV-1, FIPV-1, పెంటా-1, PCV-1
* 10 వారాలు- OPV-2, RVV-2, పెంటా 2
* 14 వారాలు- OPV-3, RVV-3, FIPV-2, పెంటా3, PCV2
* 9-12 నెలలు- MR1, JE1, FIPV3, PCV-B
* 16-24 నెలలు- MR2, JE2, OPV బూస్టర్, DPT 1
* 5-6 ఏళ్లు- DPT-2
* 10 ఏళ్లు TD-1 బూస్టర్; * 16 ఏళ్లు TD2 బూస్టర్
* 14ఏళ్ల బాలికలకు HPV
(నేడు నేషనల్ వ్యాక్సినేషన్ డే)