News June 21, 2024

BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

image

TG: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్‌లోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు. సూసైడ్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 15, 2024

ఏపీకి దివీస్ సంస్థ రూ.9.8 కోట్ల విరాళం

image

AP: వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. మంత్రి లోకేశ్‌ను కలిసిన దివీస్ సీఈవో కిరణ్ CMRFకు రూ.5 కోట్ల చెక్కును అందించారు. దీంతో పాటు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ.4.8 కోట్లను అందించారు. మొత్తంగా రూ.9.8 కోట్ల విరాళమిచ్చిన దివీస్ సంస్థను లోకేశ్ అభినందించారు.

News September 15, 2024

ఏఐ వల్ల ఉద్యోగాల కోత.. 67శాతం మంది ఇంజినీర్లలో టెన్షన్

image

కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5శాతంమంది ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని గ్రేట్ లెర్నింగ్ సంస్థ తెలిపింది. నైపుణ్యాల్ని పెంచుకోకపోతే కెరీర్‌కు రక్షణ ఉండదని 87.5శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. వచ్చే పదేళ్లలో 40శాతం వరకు జాబ్స్ ఏఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో 89శాతం మేర ఇంజినీర్లు AI, MLలోనే కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాలనుకుంటున్నారని పేర్కొంది.

News September 15, 2024

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

image

హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి పెళ్లి జరగ్గా పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. శనివారం నిర్వహించిన రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లై, ఛల్ మోహన్ రంగా, పేట, కుట్టి స్టోరీ, డియర్ మేఘ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో మేఘా నటించారు.