News June 22, 2024
రబీ కరవు నష్టంపై నివేదిక సిద్ధం

APలో 2023-24 రబీ సీజన్‌లో ఏర్పడిన కరవు పరిస్థితులపై కేంద్రం బృందం నివేదికను తయారు చేసింది. కేంద్ర రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ ఆధ్వర్యంలో నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి అధ్యయనం చేసింది. కాగా రైతులను ఆదుకునేందుకు రూ.319.77 కోట్ల సహాయం కావాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేంద్ర బృందాన్ని కోరారు.
Similar News
News November 5, 2025
టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 5, 2025
షమీకి మరోసారి నిరాశ.. రీఎంట్రీ కష్టమేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. NOV 14 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు BCCI ప్రకటించిన <<18208501>>జట్టులో<<>> ఆయనకు చోటు దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఆయన్ను సెలక్ట్ చేయని సంగతి తెలిసిందే. దీంతో షమీ కెరీర్ ముగిసినట్లేనా అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల రంజీ ట్రోఫీలో ఆయన 3 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టారు.
News November 5, 2025
కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: అనగాని

AP: కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల కోసమూ వినతులు అందినట్లు చెప్పారు. పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వీటిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. CM సూచనతో అల్లూరి(D)లో ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


