News June 22, 2024
రబీ కరవు నష్టంపై నివేదిక సిద్ధం
APలో 2023-24 రబీ సీజన్‌లో ఏర్పడిన కరవు పరిస్థితులపై కేంద్రం బృందం నివేదికను తయారు చేసింది. కేంద్ర రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ ఆధ్వర్యంలో నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి అధ్యయనం చేసింది. కాగా రైతులను ఆదుకునేందుకు రూ.319.77 కోట్ల సహాయం కావాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేంద్ర బృందాన్ని కోరారు.
Similar News
News November 2, 2024
TDP గూటికి కరణం బలరామ్?
AP: వైసీపీ సీనియర్ నేత కరణం బలరామ్ ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన TDP లేదా జనసేనలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. తన కుమారుడు కరణం వెంకటేశ్ కూడా పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ వేడుకలో CM చంద్రబాబుతో బలరామ్ ఆప్యాయంగా మాట్లాడారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గత ఎన్నికల్లో చీరాల నుంచి YCP తరఫున వెంకటేశ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
News November 2, 2024
చలి మొదలైంది.. వీటిని తింటున్నారా?
కొన్ని ప్రాంతాల్లో చలి ప్రారంభమైంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోకపోతే చలికి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఓ టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది. చిలగడదుంపలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉసిరి తింటే అనేక ఔషధాలు తిన్నట్లే. ఖర్జూరాలు, బెల్లం తింటే వేడిని పుట్టిస్తాయి. మిల్లెట్స్, నట్స్, ఆవాలు, నువ్వులు కూడా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
News November 2, 2024
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతి
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) గుండెపోటుతో మృతి చెందారు. హృదయ సంబంధిత సమస్యలతో ఆయన ఏడాదిగా బాధపడుతున్నారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) వ్యవస్థాపక సభ్యుల్లో రోహిత్ ఒకరు. భారతీయ సంప్రదాయ వస్త్ర ముద్రణ కలగలిపి ఉండే ఆయన ఆధునిక డిజైనింగ్ వస్త్రాలు విశేష ఆదరణ పొందాయి. ఆయన పనితనంలోని ప్రత్యేకత ముందు తరాలకు స్ఫూర్తిదాయకమని FDCI కౌన్సిల్ పేర్కొంది.