News June 22, 2024
అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా: సీఎం చంద్రబాబు

AP: గతంలో నాపై బాంబు దాడి జరిగినా కన్నీళ్లు పెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చెప్పారు. ‘ఆమెనే కాకుండా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకే నా జీవితంలో మొదటిసారి ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా’ అని అసెంబ్లీలో సీఎం వివరించారు.
Similar News
News September 19, 2025
మన జీవితం బాధ్యత మనదే: సాయి దుర్గ తేజ్

TG: హెల్మెట్ ధరించడం వల్లే తాను ప్రాణాలతో బయటపడినట్లు హీరో సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు. HYD పోలీసులు నిర్వహించిన ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘హెల్మెట్ ధరించని వాళ్లకి, తాగి బండి నడిపేవాళ్లకి చిన్న పనిష్మెంట్ ఇస్తే వారికి జీవితాలపై మరింత బాధ్యత పెరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే’ అని తెలిపారు. ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు.
News September 19, 2025
సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1960: భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం(ఫొటోలో)
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం
News September 19, 2025
అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక విజయం

ఆసియా కప్: అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.