News June 22, 2024
అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా: సీఎం చంద్రబాబు
AP: గతంలో నాపై బాంబు దాడి జరిగినా కన్నీళ్లు పెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చెప్పారు. ‘ఆమెనే కాకుండా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకే నా జీవితంలో మొదటిసారి ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా’ అని అసెంబ్లీలో సీఎం వివరించారు.
Similar News
News November 12, 2024
రాహుల్ వ్యాఖ్యలను సెన్సార్ చేయండి: బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అబద్ధాలు ప్రచారం చేయకుండా రాహుల్ వ్యాఖ్యలను సెన్సార్ చేయాలని ECని BJP కోరింది. ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడుతూ MH అవకాశాలను ఇతర రాష్ట్రాలు దోచుకుంటున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అత్యధిక FDIలు MHకే దక్కాయని BJP నేతలు గుర్తు చేస్తున్నారు.
News November 12, 2024
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్
AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
News November 12, 2024
Rupee Value: 2011లో ₹44.. ఇప్పుడు ₹84.38
2011లో డాలర్‌తో పోలిస్తే ₹44గా ఉన్న రూపాయి విలువ సోమవారం జీవితకాల కనిష్ఠానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి డిప్రిసియేషన్ ₹84.38కి చేరి 48% విలువ తగ్గింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి FIIల డిజిన్వెస్ట్‌మెంట్, కంపెనీల Q2 ఫలితాలు మెప్పించకపోవడం, ట్రంప్ గెలుపుతో డాలర్ మరింత బలపడే అవకాశం ఉండడంతో రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.