News June 22, 2024

T20 WC: రికార్డు సృష్టించిన షకీబ్ అల్ హసన్

image

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ నిలిచారు. 40 ఇన్నింగ్స్‌లలో ఆయన ఈ ఘనతను సాధించారు. తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రీది (39 వికెట్లు), లసిత్ మలింగా (38), హసరంగా (37), సయీద్ అజ్మల్ (36), టిమ్ సౌథీ (36) ఉన్నారు. హసరంగా కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 37 వికెట్లు తీశారు.

Similar News

News January 17, 2026

యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

image

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

News January 17, 2026

C-DAC 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>C-DAC<<>> 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు నేటి నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PG, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in

News January 17, 2026

పెళ్లికాని ఆడపిల్లలు తప్పక చేయాల్సిన పూజ

image

సావిత్రి గౌరీ వ్రతం, బొమ్మల నోము ముత్తయిదువులే కాకుండా, పెళ్లికాని ఆడపిల్లలకు కూడా ఎంతో ముఖ్యమైనది. వారు ఈ నోము నోచుకోవడం వల్ల పార్వతీ దేవికి శివుడు లభించినట్లుగా, తమకు కూడా సద్గుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని నమ్ముతారు. పూజా సమయంలో ‘గౌరీ కళ్యాణం’ వంటి పవిత్ర గాథలను చదువుకోవడం వల్ల మనసు నిర్మలమవుతుంది. సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుక పిల్లలలో భక్తి భావాన్ని, సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది.