News June 22, 2024

T20 WC: రికార్డు సృష్టించిన షకీబ్ అల్ హసన్

image

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ నిలిచారు. 40 ఇన్నింగ్స్‌లలో ఆయన ఈ ఘనతను సాధించారు. తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రీది (39 వికెట్లు), లసిత్ మలింగా (38), హసరంగా (37), సయీద్ అజ్మల్ (36), టిమ్ సౌథీ (36) ఉన్నారు. హసరంగా కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 37 వికెట్లు తీశారు.

Similar News

News July 5, 2025

అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్ సన్నాహాలు!

image

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పాసైతే కొత్త పార్టీ పెడతానని మస్క్ ఇటీవల ప్రకటించారు. తాజాగా <<16891089>>బిల్ <<>>చట్టరూపం దాల్చడంతో ‘అమెరికా పార్టీ’ పెట్టడంపై మస్క్ హింట్ ఇచ్చారు. ‘2 లేదా 3 సెనేట్ సీట్లు, 8-10 హౌస్ డిస్ట్రిక్ట్స్‌లో ఫోకస్ చేస్తే ఫలితముంటుంది. ప్రజలకు మేలు చేస్తూ వివాదాస్పద చట్టాలపై నిర్ణయాత్మక ఓటు వేయడానికి ఈ సీట్లు సరిపోతాయి’ అని ట్వీట్ చేశారు. పార్టీ లాంచ్‌కు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి.

News July 5, 2025

క్యాన్సర్‌తో మార్వెల్ నటుడు మృతి

image

హాలీవుడ్ యాక్టర్ జులియన్ మెక్‌మహన్(56) క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య కెల్లీ ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా Ex PM విలియమ్ కుమారుడైన జులియన్ 2003లో Nip/Tuck మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మార్వెల్ మూవీస్ ‘ఫెంటాస్టిక్ ఫోర్’లో ‘Dr.డూమ్’గా పాపులర్ అయ్యారు. ఇటీవల ‘FBI: మోస్ట్ వాంటెడ్’లో లీడ్ రోల్ పోషించారు. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

News July 5, 2025

ఆ 11 మంది ఏమయ్యారు?

image

TG: పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ఆచూకీ లభించడంలేదు. 39 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా, కనిపించకుండా పోయినవారి శరీర భాగాల్లో చిన్న ముక్క కూడా దొరకలేదు. దీంతో వారు కాలి బూడిదయ్యారా? లేక ఏమయ్యారు? అనేది తెలియడంలేదు. వారి అవశేషాల కోసం ఘటనాస్థలంలో మరోసారి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబీకులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.