News June 25, 2024
భారీగా పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం

హైదరాబాద్ మెట్రో ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 105% పెరిగినట్లు L&T సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా, 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగిందని పేర్కొంది. దీంతో గత ఏడాది నష్టాలు భారీగా తగ్గాయని తెలిపింది. 2022-23లో రూ.1315.99 కోట్లుగా ఉన్న నష్టాలు, 2023-24లో రూ.555.04కోట్లకు తగ్గాయి. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరేళ్లలో నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయి.
Similar News
News January 21, 2026
SONY ఠీవీ.. ఇక ఇంటికి రాదా?

TV బ్రాండ్ అనగానే విన్పించే SONY సంస్థ TCLతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై సోనీ బ్రాండ్ టీవీలు మార్కెట్లోకి రావా? అనే సందేహం నెలకొంది. అయితే SONY, BRAVIA పేర్లతోనే TCL టెలివిజన్ సెట్స్ తయారు చేయనుంది. భాగస్వామ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలో జపాన్ దిగ్గజానికి 49% వాటా, చైనా ప్రభుత్వం భాగస్వామిగా గల TCLకు 51% షేర్ ఉంటాయి. అయితే ప్రొడక్షన్ మారడంతో క్వాలిటీ తదితరాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.
News January 21, 2026
OpenAI పని ఖతం: జార్జ్ నోబుల్

OpenAI కంపెనీ త్వరలో కుప్పకూలుతుందని ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ నోబుల్ అంచనా వేశారు. ఓవైపు Google Gemini యూజర్లు పెరుగుతుంటే ChatGPT ట్రాఫిక్ వరుసగా 2 నెలలు పడిపోయిందన్నారు. ఆ కంపెనీ సింగిల్ క్వార్టర్‌లో $12B నష్టపోయిందని, టాలెంటెడ్ ఉద్యోగులూ వెళ్లిపోతున్నారని చెప్పారు. మరోవైపు మస్క్ వేసిన $134B <<14762221>>దావా<<>> ఏప్రిల్‌లో విచారణకు రానుందని గుర్తుచేశారు. వీటన్నింటితో ఆ సంస్థకు మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు.
News January 21, 2026
25న రథ సప్తమి.. ఆ దర్శనాలన్నీ రద్దు!

AP: తిరుమలలో ఈ నెల 25న రథ సప్తమిని వైభవంగా నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఆర్జిత సేవలు, NRI, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసినట్లు పేర్కొంది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించింది.


