News June 25, 2024
భారీగా పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం

హైదరాబాద్ మెట్రో ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 105% పెరిగినట్లు L&T సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా, 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగిందని పేర్కొంది. దీంతో గత ఏడాది నష్టాలు భారీగా తగ్గాయని తెలిపింది. 2022-23లో రూ.1315.99 కోట్లుగా ఉన్న నష్టాలు, 2023-24లో రూ.555.04కోట్లకు తగ్గాయి. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరేళ్లలో నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయి.
Similar News
News February 18, 2025
మంచినీళ్లు వృథా చేస్తే రూ.5000 ఫైన్

బెంగళూరు పౌరుల నీటి వాడకంపై KA ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాగునీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్ విధించనుంది. కార్ల వాషింగ్, గార్డెనింగ్, ఫౌంటేన్లు, మాల్స్, సినిమా హాళ్లలో మంచినీరు వాడొద్దని సూచించింది. ఉల్లంఘిస్తే రూ.5000, రూల్స్ పాటించేంత వరకు రోజుకు రూ.500 అదనంగా వసూలు చేస్తామంది. MON నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలోని 14000 బోర్లలో సగం ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడింది.
News February 18, 2025
విడదల రజినీకి హైకోర్టులో ఊరట

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
News February 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ బౌలర్ దూరం

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్ దూరమయ్యారు. కుడి పాదానికి గాయం కారణంగా లోకి ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అతడి స్థానంలో జెమిసన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌కు స్టార్ బౌలర్లు దూరమైన సంగతి తెలిసిందే. కీలక బౌలర్లు దూరమవడంతో బ్యాటర్లకు ఈ టోర్నీ పండగే కానుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.