News June 26, 2024
ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్!

మన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్‌లు బెంగళూరులో తుదిరూపు దిద్దుకుంటున్నాయి. ఈ రైలు తొలుత గంటకు 130 కి.మీ వేగంతో వెళ్లనుందని, ఆ తర్వాత వేగాన్ని గంటకు 160-220 కి.మీ వరకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News January 31, 2026
ఊరినే అమ్మకానికి పెట్టారు.. ఎక్కడంటే?

ఆస్ట్రేలియాలోని లికోలా అనే బుజ్జి పట్టణం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ నివసించేది ఐదుగురు మాత్రమే. ఒక జనరల్ స్టోర్, పెట్రోల్ బంక్, కారవాన్ పార్క్ ఉన్న ఈ ఊరు మొత్తం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 10మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ.63కోట్లు). 50 ఏళ్లుగా సేవా కార్యక్రమాలకు నిలయంగా ఉన్న ఈ ఊరిని ఒక్కసారిగా అమ్మాలని లయన్స్ క్లబ్ నిర్ణయించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
News January 31, 2026
ఫిబ్రవరి 12న బ్యాంకులు బంద్!

కేంద్రం తెచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో FEB 12న జరగనున్న దేశవ్యాప్త <<18979407>>సమ్మెకు<<>> బ్యాంకు సంఘాలు మద్దతిచ్చాయి. కార్మిక సంఘాలతో కలిసి స్ట్రైక్‌లో పాల్గొనాలని AIBEA, AIBOA, BEFI నిర్ణయించాయి. ఉద్యోగులెవరూ విధులకు హాజరుకాకూడదని డిసైడ్ అయ్యాయి. దీంతో ఆరోజు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. వారానికి 5 రోజుల పనిదినాలకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు.
News January 31, 2026
తిరుమల నెయ్యి.. క్లీన్ చిట్ వచ్చినట్లు YCP ప్రచారం: పయ్యావుల

AP: తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని 2022లో CFTRI రిపోర్ట్ ఇచ్చిందని, దాన్ని YCP తొక్కిపెట్టిందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. ‘మేం వచ్చాకే కల్తీ వ్యవహారం బయటపడింది. నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని NDDB రిపోర్టులో తేలింది. అయినప్పటికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు YCP ప్రచారం చేసుకుంటోంది. YCP హయాంలో TTD నిబంధనల మార్పుతోనే దుర్మార్గపు పనులకు పునాది పడింది’ అని మండిపడ్డారు.


