News June 26, 2024

ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్!

image

మన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్‌లు బెంగళూరులో తుదిరూపు దిద్దుకుంటున్నాయి. ఈ రైలు తొలుత గంటకు 130 కి.మీ వేగంతో వెళ్లనుందని, ఆ తర్వాత వేగాన్ని గంటకు 160-220 కి.మీ వరకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News February 18, 2025

నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

image

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.

News February 18, 2025

నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.

News February 18, 2025

పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

image

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్‌ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.

error: Content is protected !!