News June 26, 2024

జూన్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ల జోరు!

image

బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఈనెల మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు భారీ వృద్ధిని నమోదు చేశాయి. మిడ్‌క్యాప్ ఇప్పటివరకు 7.4% వృద్ధిని నమోదు చేసింది. 2023 NOV తర్వాత ఈ స్థాయి వృద్ధి రావడం ఇదే తొలిసారి. మరోవైపు స్మాల్‌క్యాప్ సూచీలు 10.2% పెరిగాయి. చివరగా 2021 FEBలో ఈ స్థాయి వృద్ధి రికార్డ్ అయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌పై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News July 1, 2024

జూన్‌లో అధిక వర్షపాతం.. జులైలోనూ సమృద్ధిగానే!

image

AP: జూన్‌లో సాధారణ వర్షపాతం 91.2MM కాగా 143.7MM నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180% వర్షపాతం కురవగా, ఆ తర్వాత అనంతపురం(177%) నిలిచినట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలోని 8 జిల్లాలు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈనెలలోనూ సమృద్ధిగానే వానలు కురుస్తాయని అంచనా వేసింది.

News July 1, 2024

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు అసాధ్యం: CBSE

image

ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2సార్లు బోర్డు ఎగ్జామ్స్ అసాధ్యమని CBSE తెలిపింది. ఏడాదికి 2సార్లు పరీక్షలు పెట్టి, ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యాశాఖ AUGలో సిఫార్సు చేసింది. ఈ మేరకు CBSE ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతో పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో చర్చించిన CBSE ప్రస్తుతం ఈ విధానం అసాధ్యమని తెలిపింది.

News July 1, 2024

హోంమంత్రి ఇలాకాలో కీచకపర్వం: YCP

image

AP: హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో కీచకపర్వం అంటూ ఇద్దరు మహిళలపై కొందరు దాడికి పాల్పడిన వీడియోను YCP పోస్ట్ చేసింది. నడిరోడ్డుపై మహిళల దుస్తులు చించి, వారిపై అమానుషంగా దాడి చేసినట్లు పేర్కొంది. ఇదేనా ఆడబిడ్డలకి మీరు కల్పిస్తానన్న రక్షణ అంటూ హోంమంత్రిని YCP ప్రశ్నించింది.