News June 26, 2024
జూన్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ల జోరు!

బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఈనెల మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు భారీ వృద్ధిని నమోదు చేశాయి. మిడ్‌క్యాప్ ఇప్పటివరకు 7.4% వృద్ధిని నమోదు చేసింది. 2023 NOV తర్వాత ఈ స్థాయి వృద్ధి రావడం ఇదే తొలిసారి. మరోవైపు స్మాల్‌క్యాప్ సూచీలు 10.2% పెరిగాయి. చివరగా 2021 FEBలో ఈ స్థాయి వృద్ధి రికార్డ్ అయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌పై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News July 11, 2025
అమెరికాలో రిచెస్ట్ ఇండియన్ ఇతడే

విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొందరు భారతీయులు అక్కడివారిని మించి సంపాదిస్తున్నారు. ‘2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో జెడ్‌స్కేలర్ కో ఫౌండర్ జై చౌదరి $17.9 బిలియన్లతో (రూ.1.53 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వినోద్ ఖోస్లా ($9.2 billion), రాకేశ్ గంగ్వాల్ ($6.6 b), రొమేశ్ టీ వాద్వానీ ($5.0 b), రాజీవ్ జైన్ ($4.8 b) ఉన్నారు.
News July 11, 2025
బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు ‘పట్టు’ దొరికేనా?

TG: ఎన్నికల హామీ మేరకు BC రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇటీవల BJPకి BCల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రిజర్వేషన్లు అమలైతే రెడ్డి, SC వర్గాల్లో బలంగా ఉన్న INCవైపు BCలూ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలం పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?
News July 11, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹600 పెరిగి ₹99,000కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹550 పెరిగి ₹90,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 ఎగబాకి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.