News June 28, 2024

సీడ్ యాక్సెస్ రోడ్డు.. భూములిచ్చేందుకు రైతుల సంసిద్ధత

image

AP: రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు తాడేపల్లి మండలం పెనుమాక రైతులు ముందుకొచ్చారు. మొత్తం 3.21 ఎకరాలు సేకరించాల్సి ఉంది. గతంలో భూములిచ్చిన వారికి ఎకరాకు డెవలప్‌మెంట్ ప్లాట్ల కింద 1450 గజాలు ఇచ్చారు. అయితే భూమి ధరల దృష్ట్యా 2000 నుంచి 2400 గజాల స్థలం ఇవ్వాలని రైతులు అధికారులను కోరారు. దీనిని సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News February 12, 2025

త్వరలో రాజ్యసభకు కమల్‌ హాసన్!

image

మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, సినీ స్టార్ కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆయనతో పాటు మరొకరికీ అవకాశం ఉంటుందని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు అధికార DMKతో MNM పొత్తు పెట్టుకుంది. బదులుగా కమల్‌ను రాజ్యసభకు పంపిస్తామని CM MK స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నేడు DMK మంత్రి ఒకరు, అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. MNM నుంచి మరొకరికీ అవకాశమిస్తామని పేర్కొన్నారు.

News February 12, 2025

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది.

News February 12, 2025

బర్డ్ ఫ్లూపై మంత్రి ఆదేశాలు

image

AP: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబుకు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!