News June 28, 2024

సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్

image

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌కు స్వాగతం పలికారు.

Similar News

News November 10, 2025

వనపర్తి: రేటినో స్కోపి పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం

image

వనపర్తి జిల్లాలో వైద్య శాఖ ద్వారా గుర్తించిన మధుమేహ వ్యాధిగ్రస్తుల ప్రతి ఒక్కరికి రేటినో స్కోపి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రెటినోపతి వైద్య పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభించి 100 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.  

News November 10, 2025

కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చిన UIDAI.. ఫీచర్స్ ఇవే

image

కొత్త ఆధార్ యాప్‌ను UIDAI తీసుకొచ్చింది. ఆధార్ వివరాలను ఫోన్‌లో స్టోర్ చేసుకునేందుకు, ఇతరులతో పంచుకునేందుకు రూపొందించినట్లు Xలో పేర్కొంది. ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్‌లోని ఎంపిక చేసిన వివరాలనే షేర్ చేసుకునే సదుపాయం ఇందులో ఉండటం విశేషం. మిగతా సమాచారం హైడ్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా ఉంది.

News November 10, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

☛ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్.. సచివాలయంలో ప్రార్థనల అనంతరం బాధ్యతలు
☛ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. పాల్గొన్న హరీశ్ రావు, తలసాని
☛ వరద ప్రవాహంతో నిలిచిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం దర్శనాలు పునఃప్రారంభం