News June 28, 2024
సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌కు స్వాగతం పలికారు.
Similar News
News October 14, 2024
రేషన్ బియ్యం తింటే ఇన్ని లాభాలా?
రూపాయికే కిలో బియ్యం అనేసరికి అంతా చులకనగా చూస్తుంటారు. మార్కెట్‌లో దొరికే సన్న బియ్యంవైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, రేషన్ బియ్యం తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయనే విషయం మీకు తెలుసా? ప్రజల్లో రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం.. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను యాడ్ చేసిన బియ్యాన్ని 2028 DEC వరకు ఉచితంగా ఇవ్వనుంది.
SHARE IT
News October 14, 2024
సీఐడీకి జెత్వానీ కేసు
AP: ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా, ఆ ఫైళ్లన్నింటినీ సీఐడీకి అప్పగించాలని డీజీపీ తిరుమలరావు ఆదేశించారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణాలను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.
News October 14, 2024
‘విదేశీ విద్యానిధి’ అర్హులకు గుడ్ న్యూస్?
TG: రాష్ట్రంలో విదేశీ విద్యా నిధి పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే SC, ST, BC సంక్షేమ శాఖలు ఇందుకు సంబంధించిన ఫైలును CMOకు పంపినట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫైలును CM రేవంత్ ఆమోదిస్తారని, ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని వార్తలు వస్తున్నాయి. కాగా బీసీ లబ్ధిదారులను 300 నుంచి 800, ఎస్సీలను 210 నుంచి 500, ఎస్టీలను 100 నుంచి 500కు పెంచాలని ప్రతిపాదనలు పంపారు.