News June 28, 2024

న్యాయం చేయండి.. హోంమంత్రికి సచివాలయ మహిళా పోలీసుల వినతి

image

AP: వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు కలిశారు. డీజీపీ కార్యాలయం నుంచి తమకు ప్రత్యేక జాబ్ ఛార్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నామని, తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు మాతృత్వ సెలవులు కూడా లేవని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 8, 2025

‘శుక్ల పక్షం’ అంటే ఏంటి?

image

ప్రతి నెలా అమావాస్య తర్వాత, పౌర్ణమి వరకు ఉండే 15 రోజుల కాలాన్ని శుక్ల పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షంలో చంద్రుని కళలు క్రమంగా పెరుగుతుంటాయి. రోజురోజుకూ వెన్నెల పెరుగుతుంది. చంద్రుడు ప్రకాశవంతమయ్యే స్థితిలోకి వెళ్లడం వల్ల దీనిని వృద్ధి చంద్ర పక్షం/ తెలుపు పక్షం అని కూడా అంటారు. శుక్ల అంటే తెలుపును సూచిస్తుంది. దాని ఆధారంగా శుక్ల పక్షం అనే పేరు వచ్చింది. దీన్నే శుద్ధ పక్షం అని కూడా పిలుస్తారు.

News November 8, 2025

CWCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌(CWC)లో 22 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్‌కు 21 రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://cwceportal.com/

News November 8, 2025

బిహార్ ఎన్నికల్లో మంత్రి లోకేశ్ ప్రచారం

image

AP: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మంత్రి లోకేశ్ 2 రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం ఆయన పట్నా వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం బిహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలను వారికి వివరిస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేపు ఉదయం ప్రచారం చేస్తారు.