News June 28, 2024
న్యాయం చేయండి.. హోంమంత్రికి సచివాలయ మహిళా పోలీసుల వినతి
AP: వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు కలిశారు. డీజీపీ కార్యాలయం నుంచి తమకు ప్రత్యేక జాబ్ ఛార్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నామని, తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు మాతృత్వ సెలవులు కూడా లేవని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 14, 2024
న్యూ లిక్కర్ పాలసీ.. ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం
AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
News October 14, 2024
రేషన్ బియ్యం తింటే ఇన్ని లాభాలా?
రూపాయికే కిలో బియ్యం అనేసరికి అంతా చులకనగా చూస్తుంటారు. మార్కెట్‌లో దొరికే సన్న బియ్యంవైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, రేషన్ బియ్యం తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయనే విషయం మీకు తెలుసా? ప్రజల్లో రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం.. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను యాడ్ చేసిన బియ్యాన్ని 2028 DEC వరకు ఉచితంగా ఇవ్వనుంది.
SHARE IT
News October 14, 2024
సీఐడీకి జెత్వానీ కేసు
AP: ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా, ఆ ఫైళ్లన్నింటినీ సీఐడీకి అప్పగించాలని డీజీపీ తిరుమలరావు ఆదేశించారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణాలను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.