News June 28, 2024

తెలంగాణ వ్యాప్తంగా RTA అధికారుల పెన్‌డౌన్

image

తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు పెన్‌డౌన్ పాటిస్తున్నారు. నిన్న HYDలో JTC రమేశ్‌పై ఆటో యూనియన్ నేత దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. రవాణాశాఖ కమిషనర్‌తో చర్చల అనంతరం అధికారులు నిరసనను విరమించుకున్నారు. అటు దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News November 11, 2025

ఎవరీ ఉమర్ మహ్మద్?

image

ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని భావిస్తున్న ఉమర్ మహ్మద్ 1989లో J&K పుల్వామాలో జన్మించాడు. అతడి తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ టీచర్. శ్రీనగర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉమర్ MBBS, MD చేశాడు. కొన్నాళ్లు GMC అనంతనాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. SMలో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన డాక్టర్లలో ఉమర్ ఒకడని తెలుస్తోంది.

News November 11, 2025

బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

image

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.

News November 11, 2025

విషం కలిపేందుకు లొకేషన్లలో మొయినొద్దీన్ రెక్కీ

image

HYD: గుజరాత్ ATS ఆదివారం అరెస్టు చేసిన Dr. SD మొయినొద్దీన్ విచారణలో భయానక కుట్ర బయటపెట్టాడు. చైనాలో MBBS చేసిన మొయిన్ ఇక్కడ ఆముదం తదితర వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషం తయారు చేస్తున్నాడు. ఈ విషాన్ని దేవాలయాలు, వాటర్ ట్యాంక్స్, ఫుడ్ సెంటర్లలో కలిపి మాస్ మర్డర్స్‌కు కొందరితో కలిసి ప్లాన్ చేశాడని అధికారులు గుర్తించారు. ఇందుకు అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలో రద్దీ ఫుడ్ కోర్టులు పరిశీలించాడని పేర్కొన్నారు.