News June 28, 2024
తెలంగాణ వ్యాప్తంగా RTA అధికారుల పెన్‌డౌన్
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు పెన్‌డౌన్ పాటిస్తున్నారు. నిన్న HYDలో JTC రమేశ్‌పై ఆటో యూనియన్ నేత దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. రవాణాశాఖ కమిషనర్‌తో చర్చల అనంతరం అధికారులు నిరసనను విరమించుకున్నారు. అటు దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News October 7, 2024
మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.
News October 7, 2024
దారుణం.. ప్రియుడి కోసం 13 మందిని చంపింది!
పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఓ యువతి తన పేరెంట్స్ సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
News October 7, 2024
2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనందరం చూస్తాం: పవన్
గుజరాత్ CMగా మోదీ ప్రమాణం చేసి నేటికి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు AP Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆరోజు మొదలైంది. ఆయన నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో దూసుకుపోతూ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనం చూస్తామని నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు.