News July 1, 2024

రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది. కాగా నిన్న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్‌లోని తాండూరులో 5.1 సెం.మీ, నిజామాబాద్‌లోని పొతంగల్‌లో 4.8 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

Similar News

News July 5, 2024

విక్టరీ పరేడ్‌లో తప్పిపోయిన పిల్లలు!

image

‘విక్టరీ పరేడ్’లో పాల్గొనేందుకు ముంబైలోని మెరైన్ డ్రైవ్‌కు లక్షల మంది హాజరయ్యారు. T20WC ట్రోఫీతో భారత జట్టు ప్రయాణిస్తోన్న బస్సు తమవద్దకు రాగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయారు. దాదాపు డజను మంది తప్పిపోయిన పిల్లలు మెరైన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షితంగా వారి పేరెంట్స్ వద్దకు చేరినట్లు సమాచారం.

News July 5, 2024

వారు ఏపీకి గర్వకారణం: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రానికి చెందిన దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొననుండటం ఏపీకి గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఆణిముత్యాలు క్రీడా జగత్తులో ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

News July 5, 2024

లావణ్య ఫిర్యాదుపై స్పందించిన హీరో రాజ్‌ తరుణ్

image

ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న <<13569817>>ఆరోపణల్లో<<>> నిజం లేదని హీరో రాజ్ తరుణ్ తెలిపారు. ‘లావణ్యతో రిలేషన్‌లో ఉన్నమాట వాస్తవమే. కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది. వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకే దూరం పెట్టాను. ఆమెకు నా డబ్బు కావాలి. అందుకే ఈ డ్రామా. లావణ్య నన్ను చాలా టార్చర్ పెట్టింది. కన్నతండ్రిని కూడా మోసం చేసింది’ అని మీడియాతో చెప్పారు.