News July 2, 2024
బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట: మంత్రి పొంగులేటి
TG: బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హౌసింగ్‌పై సమీక్షలో మాట్లాడుతూ వచ్చే 5ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22.50లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలి దశలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.16లక్షల ఇళ్లు, రిజర్వ్ కోటా కింద 33,500 ఇళ్లను నిర్మిస్తామన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News November 10, 2024
బంగ్లాలో నరమేధం: యూనస్‌పై ICCలో ఫిర్యాదు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)లో అవామీ లీగ్ ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు క్యాబినెట్ మెంబర్స్, ADA స్టూడెంట్ లీడర్లు సహా 62 మంది పేర్లను చేర్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక తమ పార్టీ వర్కర్స్, హిందువులు సహా మైనార్టీలపై నరమేధం జరిగిందని పేర్కొంది. సాక్ష్యాలుగా 800 పేజీల డాక్యుమెంట్‌ను సబ్మిట్ చేసింది. మరో 15000 ఫిర్యాదులకు సిద్ధమవుతోంది.
News November 10, 2024
ఆస్ట్రేలియా చెత్త రికార్డు
పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.
News November 10, 2024
కెనడాలో టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ!
కెనడాలో ఓ టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపింది. రోగితో కాంటాక్ట్‌లో ఉన్న వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కాగా ఈ బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ, డైరీ ఫామ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల USలో పలువురు కార్మికులకు సోకింది. అయితే ఈ ఫ్లూ ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుందనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.