News November 10, 2024

ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.

Similar News

News December 12, 2024

నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.

News December 12, 2024

తెలుగు సినిమా రేంజ్ ఇదే!

image

‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తమైందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిన్న ‘పుష్ప-2’ కలెక్షన్లలో రికార్డు సృష్టించడంతో తెలుగు సినిమా రేంజ్ ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 8 రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలుంటే అందులో నాలుగు మనవేనంటున్నారు. త్వరలో రిలీజయ్యే ప్రభాస్, మహేశ్ సినిమాలు కూడా ఈ జాబితాలో చేరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి?

News December 12, 2024

₹3L కోట్లు: 2024లో INCOME TAX రికార్డులివే..

image

FY25లో ట్యాక్స్ రీఫండ్‌ చెల్లింపుల్లో రికార్డు సృష్టించామని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. 2024 APR 1 నుంచి NOV 27 వరకు ఏకంగా Rs 3.08 లక్షల కోట్లు చెల్లించినట్టు చెప్పింది. గతేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇది 46.31% ఎక్కువని వివరించింది. ఈ ఏడాది గరిష్ఠంగా ఒక సెకనుకు 900, ఒక రోజు 70 లక్షల ITRలు దాఖలైనట్టు పేర్కొంది. AY 2024-25కు సంబంధించి ఒకేరోజు 1.62 కోట్ల ITRలు ప్రాసెస్ చేసినట్టు వెల్లడించింది.