News July 2, 2024

రూ.2వేల నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: RBI

image

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లలో 97.87శాతం వరకు బ్యాకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 2024 జూన్ 28 నాటికి రూ.7851 కోట్ల విలువైన నోట్లు మాత్రం ప్రజల వద్దే ఉండిపోయాయంది. కాగా 2016 నవంబరులో ఈ నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న రూ.2వేల నోట్లను కేంద్రం ఉపసంహరించుకుంది.

Similar News

News January 17, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి APR నెల కోటాను TTD రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం 20వ తేదీ ఉ.10 గంటల వరకు <>ఆన్‌లైన్‌లో<<>> రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి టికెట్ల కేటాయింపు జరుగుతుంది. అలాగే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఈ నెల 21న ఉ.10కి రిలీజ్ చేయనుంది. రూ.300 టికెట్లు ఈ నెల 24న విడుదల కానున్నాయి.

News January 17, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 12 మంది భారతీయుల మృతి

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. మరో 16 మంది అదృశ్యమైనట్లు వెల్లడించింది. మొత్తం 126 మంది ఇండియన్స్ యుద్ధంలో పాల్గొనగా 96 మంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి రష్యా తరఫున పోరాడుతూ చనిపోయిన విషయం తెలిసిందే. యుద్ధంలో భారతీయుల మరణాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

News January 17, 2025

ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

image

AP: ఉద్యోగులపై విజిలెన్స్, శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం సరికాదని Dy.CM పవన్ అన్నారు. దీనివల్ల వారి పని తీరుపై ప్రభావం పడుతుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. 3 వారాల్లో తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా కేసులను పరిష్కరించడంపై దృష్టిసారించాలన్నారు.