News July 2, 2024
ఎల్లుండి స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపు
నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్‌లో మోదీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని తెలిపాయి.
Similar News
News November 13, 2024
నేడు సభలో కీలక బిల్లులు
AP: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తూ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సమావేశాలు నవంబర్ 22 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.
News November 13, 2024
నేడు ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్
ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా స్థానాల్లో కలిపి మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అందులో కేవలం 73 మంది మాత్రమే మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,37,00,000 మంది ఓటర్ల కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
News November 13, 2024
‘మిషన్ ఇంపాజిబుల్’లో బాలీవుడ్ బ్యూటీ?
బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌ని కలిశారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సెట్లో ఆయనతో కలిసి ఫొటో దిగారు. క్రూజ్‌ను కలవడం కలలా ఉందని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దానిపై మిషన్ ఇంపాజిబుల్ ఇన్‌స్టా పేజీ కూడా స్పందించింది. కాగా అవనీత్ ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.