News January 17, 2025

ఏపీ ప్రజలు గర్వించే విషయమిది: సీఎం చంద్రబాబు

image

AP: స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదని, దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.

Similar News

News February 16, 2025

ఫాస్టాగ్ కొత్త రూల్స్.. చెక్ చేసుకోండి

image

ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి NPCI రేపటి నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. బ్లాక్‌లిస్టులో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సిందే. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్టాగ్‌ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్ సరిచూసుకోవడం మంచిది.

News February 16, 2025

నిద్రలేవగానే ఇలా చేయండి

image

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.

News February 16, 2025

కోళ్లు చనిపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

TG: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మం. నేలపట్లలో వెయ్యి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు కోళ్ల నమూనాలు సేకరించి HYDలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబుకు పంపారు. 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ రానుందని, అప్పటివరకు కోళ్లు అమ్మవద్దని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు చనిపోతే 9100797300కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

error: Content is protected !!