News July 2, 2024

ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్?

image

TG: ఈ నెల 23న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యారంటీలు, సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు ఉండొచ్చని అంచనా. చర్చలు పూర్తయ్యాక దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

Similar News

News September 20, 2024

రెండో రోజు ఆట మొదలు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. క్రీజులో సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్(102), జడేజా(86) ఉన్నారు. భారత్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News September 20, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. వారిద్దరినీ ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ USలో చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించామని, శ్రవణ్ ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు.

News September 20, 2024

బెంగాల్ X ఝార్ఖండ్: సరిహద్దు మూసేసిన మమత

image

ఝార్ఖండ్ సరిహద్దును మూసేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వల్ల 5 లక్షల క్యూసెక్కుల వరద సౌత్ బెంగాల్లోని 11 జిల్లాలను ముంచేసిందని ఆమె ఆరోపించారు. DVC ఎప్పుడూ ఝార్ఖండ్ గురించే ఆలోచిస్తోందని, దాంతో సంబంధాలు తెంపుకుంటున్నామని ప్రకటించారు. ‘ఆమెదో విపరీత చర్య. బెంగాల్‌కు ధాన్యం తెచ్చే ట్రక్కులను మేమూ ఆపేస్తాం’ అని JMM హెచ్చరించింది.