News January 16, 2025
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది. హామీల పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ విడుదల చేశారు.
1. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
** తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Similar News
News February 18, 2025
సివిల్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు

సివిల్స్ అభ్యర్థులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించింది. ఈ నెల 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఫిబ్రవరి 11తోనే ముగియగా ఇవాళ్టి వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్లలో పొరపాట్ల సవరణకు ఫిబ్రవరి 22-28 వరకు అవకాశం ఇచ్చింది. కాగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరగనుంది.
News February 18, 2025
శామ్‌సంగ్ S24 Ultra ధర ₹70,000.. ఎక్కడంటే?

మొబైల్ ఫోన్ల ధరలను పోల్చినప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉండటంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కంపెనీల ఫోన్ల ధరలు దుబాయ్‌లో తక్కువగా ఉంటాయంటారు. SAMSUNG కంపెనీకి చెందిన S24 Ultra (12/256 GB) ఫోన్ దుబాయ్‌లో సుమారు ₹70,000లకే లభిస్తుంది. అదే ఇండియాలో ₹1,04,999 (ఆన్‌లైన్ షాపింగ్ సైట్). దాదాపు ట్యాక్సుల రూపంలో ₹35,000 అధికంగా వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి.
News February 18, 2025
టెన్త్‌తో భారీగా ఉద్యోగాలు.. మరో నాలుగు రోజులే గడువు

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. టెన్త్ పాస్ లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి వయో సడలింపు ఉంది. CBT, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
సైట్: https://www.rrbapply.gov.in/