News July 3, 2024

జులై 3: చరిత్రలో ఈరోజు

image

1918: ప్రముఖ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు జననం
1931: హాస్య నటి సురభి బాలసరస్వతి జననం
1962: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ జననం
1980: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు హర్భజన్ సింగ్ జననం
2015: రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విద్వాన్ మరణం
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం

Similar News

News September 16, 2024

కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌లో షాక్ ట్రీట్మెంట్: సీఎం రేవంత్

image

TG: ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి ఇంకా కేసీఆర్ తేరుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెగ్యులర్‌గా ఫామ్ హౌస్‌లో KCRకు షాక్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. దొరల గడీలు బద్దలై ప్రజా పాలన వచ్చిందనే విషయం ఆయనకు అర్థం కావట్లేదని తెలిపారు. తెలంగాణను కబళించే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.

News September 16, 2024

KTR.. నువ్వు చాయ్, సమోసా అమ్ముకునేవాడివి: రేవంత్

image

TG: రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో KTRపై CM రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘ఇప్పుడు ట్విటర్ పిట్ట ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూటర్‌ను పుట్టించి, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. లేకపోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో చాయ్, సమోసా అమ్ముకునేవాడివి’ అని ఫైర్ అయ్యారు.

News September 16, 2024

స్టీల్ ప్లాంట్‌పై రాజకీయ సెగలు.. గతంలానే టీడీపీ కార్నర్!

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్-3ను నిలిపేయడం రాజకీయ చిచ్చుకి ఆజ్యం పోసింది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం చూస్తోందని విపక్షాలంటున్నాయి. ప్లాంట్‌ను కాపాడలేకుంటే కేంద్రం నుంచి కూటమి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనూ TDPని విపక్షాలు ఇలాగే కార్నర్ చేశాయి. ఏదేమైనా స్టీల్ ప్లాంట్‌‌కు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయమైనా APలో రాజకీయంగా పెను దుమారమే రేపనుంది.