News July 3, 2024
121కి చేరిన మరణాలు.. భోలే బాబా పరార్

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.
Similar News
News March 13, 2026
7-8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా?

7-8 గంటలు పడుకున్నా ఉదయాన్నే నీరసంగా, తల భారంగా అనిపిస్తే అది కేవలం నిద్ర సమస్య కాకపోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ D లోపం వల్ల ఎనర్జీ తగ్గి, కండరాల రికవరీ దెబ్బతింటుంది. దీంతో నిరంతరం అలసట, మూడ్ స్వింగ్స్, మెదడు మొద్దుబారడం వంటి సమస్యలొస్తాయి. సరైన ఆహారం, సూర్యరశ్మి, తగినంత నీరు తీసుకోవడంతో పాటు టెస్ట్‌లు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News March 13, 2026
LPG సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్

TG: రాష్ట్రంలో LPG సిలిండర్ల రవాణా సురక్షితంగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీసు ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చమురు సంస్థలతో సమన్వయం చేసుకోనున్నాయి. గోదాములు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కృత్రిమ కొరతను అరికట్టి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ చర్యల వెనక ఉద్దేశంగా కనిపిస్తోంది.